అది లేకుంటే ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులు జైలుకే !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా లైసెన్స్‌లు లేకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు అతిక్రమిస్తూ వ్యాపారాలు కొనసాగించే వ్యాపారులపై జిల్లా ఆహార కల్తీ, నియంత్రణ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. ఇప్పటివరకు ఆహర పదార్థాల కల్తీపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార యంత్రాంగం ఇకపై నుంచి లెసెన్స్‌లు కూడా ఉండాలని, అవి ఉన్న వారే ఆహార విక్రయాలకు అర్హులని చెబుతోంది. ఒకవేళ లైసెన్స్ లేకుండా అమ్మకాలకు పాల్పడిన వారికి రూ.5 లక్షల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నామని అధికారులు పేర్కొంటున్నారు.