రూ. 33 లక్షల ఉద్యోగం.. వచ్చినట్టే వచ్చి పోయింది !
1 min readపల్లెవెలుగువెబ్ : కోడింగ్ కాంపిటీషన్‌లో 1,000 మందితో పోటీపడి నెగ్గిన విజేతకు అమెరికా కంపెనీ మంచి ఉద్యోగం ఆఫర్ చేసింది. ఏడాదికి రూ.33 లక్షల వేతనం ఇస్తామని తెలిపింది. అతడి వయసు గురించి తెలిశాక ఉద్యోగం ఇవ్వలేమని సమాచారం పంపింది. విజేత వయసు కేవలం 15 ఏళ్లు కావడమే ఇందుకు కారణం. మహారాష్ట్రలోని నాగపూర్‌కు చెందిన వేదాంత్ దేవ్‌కాటే వయసు 15 సంవత్సరాలు. పదో తరగతి చదువుతున్నాడు. ఇంట్లో ల్యాప్‌టాప్ సాయంతో స్వయంగా కోడింగ్ నేర్చుకున్నాడు. అందులో మంచి పట్టు సంపాదించాడు. అమెరికాలోని న్యూజెర్సీ అడ్వర్‌టైజింగ్ కంపెనీ నిర్వహించిన కోడింగ్ పోటీలో పాల్గొన్నాడు. రెండు రోజుల్లో 2,066 లైన్ల కోడ్ రాశాడు. సునాయాసంగ విజయం సాధించాడు. వేదాంత్ ప్రతిభను గుర్తించిన న్యూజెర్సీ అడ్వర్‌టైజింగ్ కంపెనీ తమ మానవ వనరుల విభాగంలో ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చింది.