ఐసీఐసీఐ లాభం హై జంప్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రయివేట్ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 55% జంప్‌చేసి రూ. 7,384 కోట్లను అధిగమించింది. స్టాండెలోన్ లాభం సైతం రూ. 4,616 కోట్ల నుంచి రూ. 6,905 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 21% పుంజుకుని రూ. 13,210 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.89% నుంచి 4.01 శాతానికి బలపడ్డాయి. మొత్తం ప్రొవిజన్లు సగానికిపైగా తగ్గి రూ. 1,143 కోట్లకు పరిమితమయ్యాయి. గతేడాది(2021–22) క్యూ1లో రూ. 2,851 కోట్ల కేటాయింపులు చేపట్టింది.