ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు ఎక్కడది ?
1 min readపల్లెవెలుగువెబ్ : ఉపాధ్యాయులపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాఠశాలలపై ప్రభుత్వ విధానాన్ని వద్దనే అధికారం ఉపాధ్యాయులకు ఎక్కడిదని ప్రశ్నించారు. ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివిస్తున్నారా? అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతను పెంచేందుకే సంస్కరణలు చేపట్టామన్నారు. ఉపాధ్యాయులు చెబుతున్న వివిధ అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమని, పాఠశాలల విలీనంపై విద్యార్దుల తల్లితండ్రులూ అభ్యంతరం చెప్పటం లేదన్నారు. ఎవరో కుట్రలు చేస్తున్నారని, ఈ విధానాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.