PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థుల అస్వస్థత

1 min read


పత్తికొండ, పల్లె వెలుగు న్యూస్: పత్తికొండ మండలం చక్రాల గ్రామం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 37 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పత్తికొండ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిన్న కాసేపటికే వాంతులకు కడుపునొప్పితో బాధ పడ్డారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులను వెంటనే చికిత్సకోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలా మంది విద్యార్థులను చికిత్స అనంతరం వారి వారి ఇండ్లకు పంపించారు. కొంత మంది విద్యార్థులను అక్కడే ఉంచుకొని వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆస్పత్రికి చేరుకొని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను మెరుగైన చికిత్స అందించాలని ఎమ్మెల్యే వైద్య సిబ్బందికి సూచించింది. మధ్యాహ్న భోజనం నిర్వాహక సిబ్బంది నిర్వాకం మూలంగా మధ్యాహ్న భోజనం విషమించి విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన విద్యాధికారుల ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ లోపం మూలంగా ఇలాంటి దుష్పరిణామాలు చోటుచేసుకున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ఈ సంఘటనకు బాధ్యులైన పాఠశాల సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని డిఇఓ ను కోరారు.

About Author