ర్యాగింగ్.. అసహజ లైంగిక చర్య కోసం వేధింపులు !
1 min read

పల్లెవెలుగువెబ్ : మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాలలో సీనియర్ల దాష్టీకాలు దారుణంగా కనిపిస్తున్నాయి. అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని జూనియర్లను అత్యంత అనాగరికంగా వేధిస్తున్నట్లు కేసు నమోదైంది. అసభ్యకరంగా, అశ్లీలంగా ప్రవర్తించాలంటూ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఇండోర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేశారు. తమ సీనియర్ విద్యార్థులు తమను అత్యంత కిరాతకంగా వేధిస్తున్నారని ఆరోపించారు. అసభ్యకరంగా, అశ్లీలంగా ప్రవర్తించాలని వేధించడంతోపాటు, తమను అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని నిర్బంధిస్తున్నారని ఆరోపించారు.

