మంకీపాక్స్ పేరు మార్చండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరిగిపోతున్నాయి. కొత్త వైరస్ ఎఫెక్ట్‌తో చాలా దేశాలు అప్రమత్తం అయ్యాయి కూడా. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వారాంతంలో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇప్పటికే పలు దేశాలు ఎయిర్‌పోర్ట్‌లలో టెస్టులు, లక్షణాలు కనిపిస్తే చికిత్స.. ట్రేసింగ్ చేపడుతున్నాయి. ఈ దరిమిలా డబ్ల్యూహెచ్‌వోకు ఓ అరుదైన విజ్ఞప్తి వచ్చింది. మంకీపాక్స్ వైరస్ పేరును అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్వోకి విజ్ఞప్తులు అందుతున్నాయి. మంకీపాక్స్ అనే పేరునే ట్రీట్‌మెంట్‌లో ఉన్న రోగులు ఓ కళంకంగా భావించే అవకాశం ఉంది. పైగా ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలు జాతివివక్షగా భావించే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి, వైరస్ పేరు మంకీపాక్స్ నుంచి మరోలా మార్చాలని ప్రపంచ ఆర్గోగ్య సంస్థకు న్యూయార్క్ సిటీ పబ్లిక్ హెల్త్ కమిషనర్ అశ్విన్ వాసన్ ఓ లేఖలో కోరారు.