PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​​’ రూల్సా… డేంట్ కేర్​..!

1 min read
పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు ఇలా..

పట్టణంలోని ఓ మద్యం దుకాణం వద్ద మందుబాబులు ఇలా..

– మద్యం దుకాణాల వద్దే సిట్టింగ్స్​
– అనుమతి లేకుండా నీళ్ల ప్యాకెట్స్​, కూల్ డ్రింక్స్​ అమ్మకాలు..
– పట్టించుకోని అధికారులు
పల్లెవెలుగు వెబ్​, నందికొట్కూరు: కరోన వైరస్​.. ఎవరికి ఉందో.. ఎవరికి లేదో.. తెలియక.. అష్టకష్టాలు పడుతూ… ప్రపపంచమంతా వణికిపోతుంటే.. ఒక్క మద్యం దుకాణాల వద్ద మాత్రం డోంట్ కేర్​ అంటున్నారు. ఎటు నుంచి .. ఏం ముంచుకొస్తున్నా… ఎన్ని ప్రభుత్వాలు హెచ్చరించినా… సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మద్యం ప్రియులు.
రాజకీయ జోక్యం..
నందికొట్కూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ఒక బార్, మూడు ప్రభుత్వ మద్యం దుకాణాలు కేటాయించింది. అయితే మద్యం దుకాణాల వద్ద పక్కనే సిట్టింగ్స్ ఏర్పాటు కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఒక్క బార్ కు మాత్రమే సిట్టింగ్ రూముకు ప్రభుత్వ అనుమతి ఉంది. అయితే కొంత మంది రాజకీయ నాయకులు అండతో ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి రెండు ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్స్ ఏర్పాటు చేసి ప్రవేట్ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వాటర్​, కూల్​డ్రింక్స్​, తినుబండారాలు జోరుగా విక్రయిస్తున్నారు. కరోనా కేసులు పెరగడానికి మద్యం దుకాణాలు కేంద్రాలుగా మారాయని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు.


పట్టించుకోని అధికార యంత్రాంగం..:
మాస్కులు లేకపోయినా.. భౌతిక దూరం పాటించకపోయినా.. చర్యలు తీసుకునే అధికారులు, పోలీసులు… మద్యం దుకాణాల వద్ద విచ్చలవిడిగా మందుబాబులు సిట్టింగ్స్​ వేసినా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా బార్లలోనూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు వున్నాయి. ఇప్పటికైనా పోలీసులు, జిల్లా అధికార యంత్రాంగం స్పందించి మద్యం దుకాణాల వద్ద కోవిడ్​ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని నందికొట్కూరు పట్టణ ప్రజలు కోరారు.

About Author