జూబ్లిహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ !
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ అమ్నీషియా పబ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకుకి బెయిల్ లభించింది. ఎమ్మెల్యే కొడుకు రహిల్ ఖాన్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదట జువెనైల్ బోర్డు బెయిల్‌కు నిరాకరించడంతో.. హైకోర్టులో బెయిల్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. దీంతో హైకోర్టు బుధవారం మైనర్ అయిన ఎమ్మెల్యే కొడుక్కి బెయిల్ మంజూరు చేసింది. కాగా జువైనల్ హోమ్‌లో ఉన్న నలుగురు నిందితులకు మంగళవారమే బెయిల్ వచ్చింది.