అవినీతి మంత్రిని తొలగించిన సీఎం !
1 min readపల్లెవెలుగువెబ్ : పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో మంత్రి పార్థా ఛటర్జీ పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేటేశారు. మంత్రి సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఫ్లాట్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడుల్లో కోట్ల రూపాయల అక్రమ నగదు బయటపడుతుండటంతో ముఖ్యమంత్రి మమత ఎట్టకేలకూ స్పందించారు. మంత్రి పదవి నుంచి పార్థా ఛటర్జీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఇవాళ క్యాబినెట్ సమావేశంలో చర్చించాక మంత్రిని తొలగించాలని నిర్ణయించినట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే కేబినెట్ సమావేశంలో పార్థా చటర్జీపై చర్చించకుండానే వేటేసినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి.