పోటీ నడుమ కొనసాగుతోన్న స్పెక్ట్రం వేలం !
1 min readపల్లెవెలుగువెబ్ : దేశంలో 5జీ సేవలను అందించేందుకు సంబంధించిన 5G నెట్‌వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశీయ దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, జియో చైనా కంపెనీలతో భాగస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో చైనాకు ఇక తలుపులు మూత పడ్డాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకవసరమైన స్పెక్ట్రంను కేటాయింపుల వేలంలో టెల్కోలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. వేలం ప్రక్రియ మూడో రోజు నేడు (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.