భారీగా పెరిగిన బంగారం !
1 min readపల్లెవెలుగువెబ్ : ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్ లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలు ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం గోల్డ్ ధర భారీగా పెరిగింది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధర పెరిగింది. హైదారాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100 కాగా, 24 క్యారెట్స్ బంగారం ధరం రూ. 51,380గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,380గా ఉంది.