రయ్.. రయ్ మంటూ దూసుకెళ్లిన టీవీఎస్ షేరు !
1 min readపల్లెవెలుగువెబ్ : టీవీఎస్ మోటార్ కంపెనీ కన్సాలిడేటెడ్‌గా జూన్ త్రైమాసికానికి రూ.297 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఆదాయం రూ.7,348 కోట్లకు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో టీవీఎస్ షేరు శుక్రవారం నాటి మార్కెట్‌లో 5 శాతం ఎగిసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో టీవీఎస్ మోటార్ రూ.15 కోట్ల నష్టాన్ని ప్రకటించడం గమనార్హం. ఆదాయం రూ.4,692 కోట్లుగా ఉంది. గతేడాది మొదటి త్రైమాసికంలో లాక్‌డౌన్‌లు అమల్లో ఉన్నందున, నాటి ఫలితాలను తాజాగా ముగిసిన త్రైమాసికంతో పోల్చి చూడకూడదని సంస్థ పేర్కొంది. ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల విక్రయాలు (ఎగుమతులు సహా) 9.07 లక్షల యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి విక్రయాలు 6.58 లక్షల యూనిట్లుగా ఉండడం గమనించాలి.