పొగాకు వాడితే `బాధాకరమైన మృత్యువు` !
1 min readపల్లెవెలుగువెబ్ : ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి పొగాకు ఉత్పత్తులపై కనిపించే చిత్రం, ఆరోగ్య హెచ్చరిక మారనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ ‘పొగాకు కేన్సర్ కారకం, ప్రాణాంతకం’గా ఉన్న వాక్యం బదులు ‘పొగాకు బాధాకరమైన మృత్యువుకు దారితీస్తుంది’ అనే వాక్యాన్ని ఉపయోగించనున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పొగాకు ఉత్పత్తుల తయారీ, ఉత్పత్తి, సరఫరా, దిగమతి, ఎగుమతి లేదా పంపిణీలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భాగస్వాములైన ప్రతి ఒక్కరూ తాజా నిబంధనను అమలుచేయాలని పేర్కొంది.