అదరగొట్టిన ఐసీఐసీఐ బ్యాంక్: 4వేల కోట్ల లాభం
1 min readపల్లెవెలుగు వెబ్: ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ ఐసీఐసీఐ బ్యాంక్ క్యూ4లో లాభాలతో అదరగొట్టింది. 2020-21 సంవత్సరం మార్చి త్రైమాసికానికి గానూ.. 4,402 కోట్ల లాభాన్ని ప్రకటించింది. 2019-20 సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు నికర లాభం రూ.1221 కోట్లుగా ఉంది. త్రైమాసిక కాలంలో బ్యాంకు మొత్తం ఆదాయం రూ.23,443 కోట్ల నుంచి.. రూ.23,952 కోట్లకు చేరింది. బ్యాంక్ ఎన్.పీ.ఎలు 5.53 శాతం నుంచి 4.96 శాతానికి తగ్గింది. నికర ఎన్.పీ.ఏలు 1.41 శాతం నుంచి 1.41 శాతంగా స్థిరంగా ఉన్నాయి. బ్యాంకు మొండి బకాయిలు, కంటెంజెన్సీ కోసం చేసిన కేటాయింపులు రూ.5,967 కోట్ల నుంచి రూ.2,888 కోట్లకు తగ్గింది. మొత్తం బ్యాంకు నికర ఆదాయం 43,621 కోట్లు ఉండగా… నికర లాభం 4,881 కోట్లుగా ఉంది.