PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొలిటిక‌ల్ ఎంట్రీ పై జ‌గ‌ప‌తిబాబు కామెంట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు పొలిటికల్‌ ఎంట్రీపై స్పందించాడు. ‘సినిమానే ఒక మాయ.. పాలిటిక్స్ ఓ మాయాలోకం. ఆ మాయాలోకం అర్థం చేసుకోవడం నావల్ల కాదు. నాకంత బుర్ర లేదు, ఓపిక అంతకన్నా లేదు. కాబట్టి రాజకీయాల గురించి నేను ఆలోచించడం లేదు. నలుగురితో మాట్లాడే తెలివే లేదు. అలాంటిది రాజకీయాల్లో జాయిన్‌ అయి వాళ్లతో ముందుకెళ్లడం కష్టం. నాలాంటోడు రాజకీయాలకు పనికిరాడు. రాజకీయాల గురించి నాకున్న అవగాహన సున్నా. కాబట్టి పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వడం, నేను ఓ పార్టీ పెట్టడం అనేది జరగని పని’ అని చెప్పుకొచ్చాడు జగపతిబాబు.

                                                         

About Author