NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆసియాలోనే అత్యంత సంపన్నురాలిగా సావిత్రీ జిందాల్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : జిందాల్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ సావిత్రీ జిందాల్‌ ఆసియాలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఐదేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న చైనాలోని అతి పెద్ద రియల్టీ దిగ్గజం కంట్రీ గార్డెన్‌ హోల్డింగ్స్‌ కో చైర్‌పర్సన్‌ యాంగ్‌ హుయాన్‌ మూడో స్థానానికి పడిపోయారు. చైనాకే చెందిన మరో వ్యాపార దిగ్గజం ఫాన్‌ హాంగ్‌వియ్‌ రెండో స్థానానికి ఎగబాకారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్ల తాజా సూచీ ఈ మేరకు పేర్కొంది. జిందాల్, ఫాన్‌ నికర సంపద 11.3 బిలియన్‌ డాలర్లు (రూ.89,490 కోట్లు) కాగా యాంగ్‌ సంపద 11 బిలియన్‌ డాలర్లకు (రూ.87,114 కోట్లకు) పడిపోయినట్టు తెలిపింది. ఈ ఏడాది మొదట్లో ఏకంగా 23.7 బిలియన్‌ డాలర్లున్న యాంగ్‌ సంపద విలువ చైనా రియల్టీ సంక్షోభానికి అద్దం పడుతూ ఏడు నెలల్లోనే 50 శాతానికి పైగా పడివడం గమనార్హం.

                                             

About Author