ఇలా కోటి మందిలో ఒకరికి మాత్రమే జరుగుతుందట !
1 min readపల్లెవెలుగువెబ్ : బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో అరుదైన ఘటన జరిగింది. యాష్లీ నెస్ అనే మహిళకు ఒకే కాన్పులో ఒకేతీరుగా ఉన్న ఇద్దరు కవలల (ఐడెంటికల్ ట్విన్స్) జంట జన్మించారు. ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు, ఒకే తీరుగా ఉన్న ఇద్దరు అబ్బాయిలు… మొత్తానికి నలుగురు పిల్లలు జూలై 28న పుట్టారు. కోటిమందిలో ఒక్కరికి మాత్రమే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఇంకో ప్రత్యేకత ఉంది. ఇచ్చిన కాన్పు తేదీ కంటే.. పన్నెండువారాలు ముందుగా పుట్టారు. ఇలాంటివి ‘కోటిలో ఒక్కరు’ఇంతకుముందు కూడా జరిగాయి.