ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సవాల్ !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ తనపై తప్పడు వార్తలు రాయించారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విజయవాడలో తనకు మద్యం షాప్ల బినామీలు ఉన్నట్లు ఆరోపణలను ఆయన ఖండించారు. రాధాకృష్ణకు దమ్ముంటే తన బినామీలు ఎవరో బయటపెట్టాలని నారాయణస్వామి సవాల్ విసిరారు. ‘‘రాధాకృష్ణ నీచపు బుద్ధి మానుకోవాలి. ఆంధ్రజ్యోతిలో వచ్చిన తప్పుడు కథనంపై పరువునష్టం దావా వేస్తా. ఈ-వేలం ద్వారా బార్లకు లైసెన్స్లు పొందుతున్నారు. నిబంధనలు ప్రకారం వేలం జరుగుతుంటే రాధాకృష్ణ ఓర్వలేకపోతున్నారు. ఆంధ్రజ్యోతి నిజమని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ నారాయణస్వామి విసిరారు.