మంకీపాక్స్ వైరస్.. చేయాల్సినవి, చేయకూడనివి ఇవే !
1 min readపల్లెవెలుగువెబ్ : మంకీపాక్స్ వైరల్ వ్యాధికి సంబంధించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేయవలసినవి., చేయకూడని పనుల జాబితాను విడుదల చేసింది.
చేయవలసినవి :
- ఈ వ్యాధి సోకిన వ్యక్తిని ఇతరుల నుండి వేరుచేయండి, తద్వారా వ్యాధి వ్యాప్తి చెందదు.
- ఏ పని చేయాలన్నా హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించండి లేదా మీ చేతులను సబ్బుతో కడుక్కోండి.
- రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ నోటిని మాస్క్‌తో పాటు చేతులను డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను వాడండి.
- మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచడానికి క్రిమిసంహారకాలను ఉపయోగించండి.
చేయకూడనివి:
- మంకీపాక్స్ కోసం పాజిటివ్ పరీక్షలు చేసిన వ్యక్తులతో పరుపులు, టవల్స్ ఇతర వాటిని పంచుకోకండి.
- వ్యాధి సోకిన వ్యక్తుల దుస్తులు ఉతకవద్దు.
- ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయనే అనుమానం ఏకాస్త అనిపించినా కూడా పబ్లిక్ లోకి ఫంక్షన్స్ కు వెళ్లకపోవడం మంచిది.
- వైరస్ సోకిన వ్యక్తులను., అనుమానిత రోగులను దూరం పెట్టకండి. అలాగే, ఈ వ్యాధి విషయంలో ఎలాంటి పుకార్లను నమ్మవద్దు.