ఎక్కువ డబ్బు సంపాదించుకోండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ ఉద్యోగులకు మరో బంపరాఫర్ ప్రకటించింది. సంస్థలోనే కాకుండా బయట ఉద్యోగులకు నచ్చిన పనిచేసుకోవచ్చని తెలిపింది. తద్వారా ఆర్ధికంగా బలపడొచ్చని చెబుతోంది. స్విగ్గీ సంస్థ ఇటీవలే ఫ్యూచర్ వర్క్ పాలసీలో భాగంగా ఉద్యోగులు శాశ్వతంగా ఎక్కడి నుంచైనా పని చేసుకునే వెసులుబాటును కల్పించింది. కార్పొరేట్, సెంట్రల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్‌లు రిమోట్‌గా పనిచేస్తూ ఉండొచ్చని తెలిపింది. తాజాగా మూన్ లైటింగ్ పాలసీ పేరుతో మరో కొత్త పని విధానాన్ని అమలు చేసింది. ఆఫీస్ అయిపోయిన తర్వాత, లేదంటే వీకెండ్స్‌లో పనిచేసుకోవచ్చని స్విగ్గీ హెచ్ఆర్ హెడ్ గిరీష్ మీనన్ తెలిపారు.