నిజమని తేలితే గుణపాఠంలా చర్యలు !
1 min readపల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎంపీ గోరంట్ల వ్యవహారంపై విచారణ జరుగుతోందన్నారు. మార్ఫింగ్ కాదని తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజమని తేలితే అందరికీ గుణపాఠంలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వాటిని పార్టీ అసలు సహించదని సజ్జల పేర్కొన్నారు.