నోటా నొక్కే వారి సంఖ్య పెరుగుతోంది !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత ఉన్నవాడు ఒక్కడూ లేడని అనుకునేవాళ్లు నోటా బటన్ నొక్కుతున్నారు. ఎన్నికల సంఘమైతే దానిని ప్రవేశపెట్టింది సరే.. మరి దానిని ఎవరైనా వినియోగిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్. నోటా అంటే.. ‘పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరూ కాదు’ అని అర్థం. గత ఐదేళ్లలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో అంటే 2018-22 మధ్య కాలంలో ఏకంగా 1.29 కోట్ల మంది ఈ నోటాను ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు 64,53,652 మంది ఓటేసినట్టు ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ నివేదిక తెలిపింది. మొత్తంగా నోటాకు 65,23,975 (1.06 శాతం) ఓట్లు వచ్చినట్టు పేర్కొంది.