పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం !
1 min readపల్లెవెలుగువెబ్ : టెక్ దిగ్గజం ఒరాకిల్ అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అనలిస్ట్ రిలేషన్స్ నుంచి రిక్రూట్మెంట్ విభాగం వరకు వేర్వేరు స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పక్కనపెట్టింది. తొలగింపు వేటుకు గురైనవారిలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్నవారినుంచి కొత్త ఉద్యోగులు కూడా ఉన్నారు. అన్నీ టీమ్లు, వేర్వేరు స్థానాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిలను తొలగించింది. సీఎక్స్(కస్టమర్ ఎక్స్పీరియన్స్) ప్రీసేల్స్, మార్కెటింగ్ టీమ్లకు చెందిన ఇంజనీర్లపై వేటు వేసింది. ఒక్కో టీమ్ నుంచి 7 – 10 మందిని పక్కనపెట్టినట్టు టెక్ న్యూస్ వెబ్సైట్ ‘ది రిజిస్టర్’ వెల్లడించింది.