PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుప్ప‌కూలిన మాక్రోటెక్ డెవ‌ల‌ప‌ర్స్ షేర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రియల్ ఎస్టేట్ డెవలపర్ మాక్రోటెక్ డెవలపర్స్(లోథా) మొత్తం ఈక్విటీలో దాదాపు 2 శాతం బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారింది. దీంతో గురువారం ఇంట్రా-డేలో మాక్రోటెక్ డెవలపర్స్ షేర్లు 8 శాతం పడిపోయి రూ.1,010కి చేరాయి. ఉదయం 09:16 గంటలకు మాక్రోటెక్ డెవలపర్స్ మొత్తం ఈక్విటీలో 0.74 శాతం అంటే 3.2 మిలియన్ల ఈక్విటీ షేర్లు బీఎస్ఈలో బ్లాక్ డీల్ ద్వారా చేతులు మారాయని డేటా చూపిస్తోంది. ఉదయం 10:11 గంటలకు దాదాపు 6.2 మిలియన్ షేర్లు లేదా కంపెనీ మొత్తం ఈక్విటీలో 1.33 శాతం ఎన్‌ఎస్‌ఈలో చేతులు మారాయి.

                                     

About Author