వంట నూనె ధర దిగి వస్తుందట !
1 min readపల్లెవెలుగువెబ్ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 50 బీపీఎస్ పాయింట్లు మేర పెంచుతూ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీసీ కమిటీ ఏకగగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. తాజా పెంపుతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) 5.15 శాతానికి సర్దుబాటు చేసింది. జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక పరిస్థితులకు సహజంగానే ప్రభావితమవుతోందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఆర్థికవ్యవస్థ అధిక ద్రవ్యోల్బణంతో సతమతమవుతోంది. ద్రవ్యోల్బణం 6 శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు. త్వరలోనే వంటనూనెలు దిగి రానున్నాయని ఆయన చెప్పారు.