బాలకృష్ణ కంపెనీ షేర్లు ఢమాల్… ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో గత రెండు రోజులుగా కంపెనీ షేర్లు దారుణంగా పతనమవుతున్నాయి. శుక్రవారం ఇంట్రా డేలో 6 శాతం పడిపోయి రూ.2,190కి చేరుకున్నాయి. ముడి సరుకు ధరలు పెరగడంతో మార్జిన్ పనితీరును ప్రభావితం చేసింది. దీంతో త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా మారాయి. మూడు ట్రేడింగ్ రోజుల్లో టైర్స్, రబ్బర్ ఉత్పత్తుల కంపెనీ స్టాక్ 10 శాతం పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎబిటా మార్జిన్ల 550 బేసిస్ పాయింట్లు తగ్గింది. త్రైమాసికంగా 910 బేసిస్ పాయింట్లు, వార్షికంగా 20.1 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ప్రస్తుత త్రైమాసికంలో ముడి సరుకు ధరలు అంచనాకు అనుగుణంగానే ఉన్నాయి.