PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప‌రాష్ట్ర‌ప‌తిగా జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ విజ‌యం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్‌ ధ‌న్ ఖ‌ర్ ఘనవిజయం సాధించారు. ఈ నెల 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపరాష్ట్రపతి ఎన్నిక జరిగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. ఆ వెంటనే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 725(92.94%) ఓట్లు పోలయ్యాయి. నిజానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 788 కాగా.. 8 ఖాళీలున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయినా.. ఆ పార్టీకి చెందిన శిశిర్‌ కుమార్‌ అధికారి, దివ్యేందు అధికారి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ధన్‌ఖడ్‌కు 528, యూపీఏ బలపరిచిన అభ్యర్థి మార్గరేట్‌ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. ధ‌న్ ఖ‌ర్కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది.

                                              

About Author