PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉప రాష్ట్ర‌ప‌తి జీత‌మెంతో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాజ్యాంగబద్దంగా భారతదేశ రెండో అత్యున్నత పదవి.. ఉపరాష్ట్రపతి. అయితే రాష్ట్రపతిలా ఆమోద ముద్రలు, ఇతర నిర్ణయాలకు పరిమితం కాలేదు ఉపరాష్ట్రపతి. పార్లమెంట్‌లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్‌ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్‌, ఇతర సదుపాయాలు కూడ ఉంటాయి. ఉప రాష్ట్రపతికి శాలరీస్‌ అండ్‌ అలవెన్సెస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ఆఫీసర్స్‌ యాక్ట్‌ 1953 ప్రకారం.. జీతభత్యాలను చెల్లిస్తారు. ఎందుకంటే.. రాజ్యసభకు ఆ వ్యక్తి చైర్మన్‌(ఎక్స్‌ అఫీషియో)గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే స్పీకర్‌లాగే ఉపరాష్ట్రపతికి జీతం, ఇతర బెనిఫిట్లు అందుతాయి. ఉపరాష్ట్రపతి జీతం.. అక్షరాల నాలుగు లక్షల రూపాయలు. ఇవి కాకుండా రకరకాల అలవెన్స్‌లు అందుతాయి. 2018 వరకు 1లక్ష25వేల రూపాయలుగా ఉండేది. ఆ దఫా బడ్జెట్‌లో మార్పుల మేరకు జీతం పెరిగింది. డెయిలీ అలవెన్స్‌, ఉచిత వసతి, మెడికల్‌ కేర్‌, ట్రావెల్‌, ఇతరత్రాలు అందుతాయి. పదవి నుంచి దిగిపోయాక.. సగం జీతం పెన్షన్‌గానూ అందుతుంది.

                                        

About Author