మద్యం తాగి నడిపితే.. సహచరులు కూడ బాధ్యులేనట !
1 min readపల్లెవెలుగువెబ్ : బైక్, లేదా కారును నడిపే వ్యక్తి మద్యం సేవిస్తే అందుకు సహచరులు కూడా బాధ్యత వహించల్సిందేనని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. వాహనచోదకుడు మద్యం సేవించివున్నాడా లేదా అన్నది పక్కనున్న వారికి తెలియకుండా ఉండదని, మద్యం సేవించారని తెలిస్తే వారిని వారించకుండా ఉండిపోయారంటే, ఆ తరువాత ఘటనలకు వారు కూడా బాధ్యులేనని తేల్చిచెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భరత్ చక్రవర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. చెన్నైకి చెందిన కళాశాల విద్యార్థి అన్బుసూర్య ఇటీవల తన కారులో తన స్నేహితుడు సెబాస్టియన్ కృష్ణన్, సోదరి డాక్టర్ లక్ష్మితో కలసి వెళ్తూ మెరీనా బీచ్ సమీపంలో కొందరిని ఢీకొనడంతో ఓ పోలీసు, ఇద్దరు జాలర్లు మృతి చెందిన విషయం తెలిసిందే.