రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. ‘నేషనల్ చుంగ్–షాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ డిప్యూటీ హెడ్ హోదాలో ఔ యాంగ్ వివిధ క్షిపణి అభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షిస్తున్నారు.