పీఎస్ఎల్వీడీ1 రాకెట్ ప్రయోగం సక్సెస్ !
1 min readపల్లెవెలుగువెబ్ : చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించింది.