‘చేనేత’లు… ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
1 min readరాష్ట్ర తొగటవీర క్షత్రియ సేవాసంఘం అధ్యక్షుడు మోడెమ్ వీరంజనేయప్రసాద్
పల్లెవెలుగు వెబ్, అన్నమయ్య జిల్లా రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలను చేనేత కార్మికులు ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తొగట వీర క్షత్రియ సేవా సంగం రాష్ట్ర అధ్యక్షుడు మోడెమ్ వీరాంజనేయప్రసాద్ పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటి లో 8వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తొగటవీర క్ష త్రియ సేవాసంగం రాష్ట్ర అధ్యక్షులు మోడెమ్ వీరాంజనేయప్రసాద్ ఆధ్వర్యంలో వందలాది మంది చేనేత కార్మికుల తో ఆదివారం బంగ్లా వద్ద నుండి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టరు తమీమ్ అంశారియా ఐ ఏ ఎస్ గారు జండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ అనంతరంబాలికల ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు ఆర్థికంగా అభివృద్ధి చెందదానికి రాష్ట్రప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం గమనించి ప్రతిఒక్కరు లబ్ది పొందాలని కోరారు. ఇంకా ఏమైన సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తేవాలన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలసి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ అధ్యక్షుడు బి వెంకటరత్నం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ మూర్తి,మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సిబ్యాల విజయ భాస్కర్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి రేణుక,జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర,చేనేత కార్మిక శాఖ ఏ డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ పి మోడెమ్ నాగభూషణం,చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.