PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొప్పాయితో లాభాలు ఏంటో తెలుసా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బొప్పాయి తింటే ఎంతో మంచిద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిలో ఎన్నో ఆరోగ్య ర‌హస్యాలు ఉన్నాయ‌ని అంటున్నారు. బొప్పాయిలో విటమిన్‌ సి, యాంటీఆక్సిడెంట్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అవి కొవ్వు పేరుకు పోకుండా అడ్డుకుంటాయి. శరీర బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్య ఔషధం, పండు తీయగా ఉన్నా ఇందులో కాలరీస్‌ చాలా తక్కువ. బొప్పాయిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉండి ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది.
మధుమేహం వ్యాధితో బాధపడేవాళ్లు కూడా ఈ పండును నిస్సందేహంగా తినవచ్చు. డయాబెటిస్‌ వచ్చే అవకాశమున్న వారు ఈ పండు తింటే డయాబెటిస్‌ బారిన పడరు. ఈ పండులో విటమిన్‌ ‘ఎ’ కూడా ఉంటుంది. ఇది కళ్లకు ఎంతో మంచిది. చూపు మందగించకుండా కాపాడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కూడా బొప్పాయి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా ఇది పనిచేస్తుంది. బొప్పాయిలో పఫైన్‌ అండే డైజెస్టివ్‌ ఎంజైమ్‌ ఉంది. ఇది జీర్ణక్రియ సరిగ్గా జరిగేట్లు చేస్తుంది. ఇందులో ఉన్న పీచుపదార్థాల వల్ల మనం తీసుకునే ఆహారం సులభంగా అరుగుతుంది.

                                              

About Author