ఆ చైనా ఫోన్ల పై భారత్ లో నిషేధం !
1 min readపల్లెవెలుగువెబ్ : తక్కువ రేటు చైనా ఫోన్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలన్న భారత ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా షావోమీలాంటి చైనీస్ బ్రాండ్లతో సహా చాలావాటికి దెబ్బ పడనుంది. ముఖ్యంగా ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మొబైల్ మార్కెట్ అయిన భారత్.. తద్వారా దిగువ విభాగం నుండి చైనీస్ కంపెనీలను బయటకు గెంటేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశ ఎంట్రీ లెవల్ మార్కెట్ నుంచి తప్పించడం ద్వారా షావోమీ, మరికొన్ని సహచర కంపెనీలను నిలువరించడమే భారత వ్యూహమని నిపుణులు చెప్తున్నారు. చైనాలో కరోనా, లాక్డౌన్ ప్రభావంతో అక్కడి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. దీంతో ఎక్కువగా భారతదేశంపైనే ఆధారపడుతోంది ఆ మార్కెట్. మార్కెట్ ట్రాకర్ కౌంటర్‌పాయింట్ ప్రకారం, జూన్ 2022 వరకు త్రైమాసికంలో 12వేలరూపాయల లోపు స్మార్ట్ఫోన్లు.. భారతదేశ విక్రయాలకుగానూ మూడింట ఒక వంతుకు దోహదపడ్డాయి. చైనా కంపెనీలు ఆ షిప్మెంట్లలో 80% వరకు ఉండడం గమనార్హం.