ముకేష్ అంబానీ జీతం `సున్నా` !
1 min readపల్లెవెలుగువెబ్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముకేష్ అంబానీ వరుసగా రెండవ ఏడాది జీతాన్ని త్యజించారు. కొవిడ్ మహమ్మారి ఆర్థిక వ్యవస్థతోపాటు వ్యాపార, పారిశ్రామికరంగంపై తీవ్ర దుష్ప్రభావం చూపడంతో 2020-21 వేతనాన్ని వదులుకున్న ఆయన.. 2021-22లోనూ ఇదే విధానాన్ని కొనసాగించారు. ముకేష్ అంబానీ స్వచ్ఛందంగా వేతనాన్ని వదులుకున్నారని వార్షిక నివేదికలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తెలిపింది. చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ గత రెండేళ్లకు సంబంధించిన అలవెన్సులు, సౌకర్యాలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, కమీషన్ లేదా స్టాక్ అవకాశాలను అంబానీ పొందలేదని కంపెనీ వెల్లడించింది. 2008-09 ఏడాది నుంచి ముకేష్ అంబానీ రూ.15 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నారు. సౌకర్యాలు, అలవెన్సులు, కమీషన్లతో కలుపుకుని మొత్తం రూ.24 కోట్లకుపైగానే అందుతోంది.