వాతావరణ మార్పులతో అంటువ్యాధుల ప్రమాదం !
1 min read
పల్లెవెలుగువెబ్ : వాతావరణ మార్పులు, అంటువ్యాధుల మధ్య సంబంధం ఉందని పరిశోధకులు నిర్థరించారు. వాతావరణంలో విపరీతమైన మార్పుల వల్ల మనకు తెలిసిన అంటువ్యాధుల్లో 58 శాతం వరకు తీవ్రమవుతున్నట్లు గుర్తించారు. కోవిడ్-19 మహమ్మారి, మంకీపాక్స్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో ఈ నివేదిక విడుదలైంది. యూరోప్‌లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. దావానలాలతో అమెరికా ఇబ్బందులుపడుతోంది. వందలాది ఎకరాల్లో అడవులు కాలిపోయాయి. లక్షలాది మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవలసి వచ్చింది. ఇలాంటి పరిణామాలకు కారణం విపరీతమైన వాతావరణ పరిస్థితులేనని పరిశోధకులు చెప్తున్నారు.