PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చైనాలో మ‌రో వైర‌స్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని పొట్టన పెట్టుకుంది. తాజాగా అలాంటిదే మరో వైర్‌సను చైనా పరిశోధకులు గుర్తించారు. దీన్ని లాంగ్యా హెనిపావైర్‌సగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని షాన్‌డోంగ్‌, హెనన్‌ ప్రావిన్సుల్లో 35 కేసులు వెలుగుచూశాయి. ఈ వైరస్‌ జంతువుల నుంచి మనుషులకు సోకుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు. ఇది సోకిన వారిలో కాలేయం, మూత్రపిండాలు విఫలమవుతాయని స్పష్టం చేస్తున్నారు. తొలుత జ్వరం, నీరసం, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పులు, వాంతులు, తలపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైర్‌సను కనుగొనేందుకు తైవాన్‌లోని రోగ నియంత్రణ కేంద్రాలు(సీడీసీ) ఒక పరీక్ష విధానాన్ని నెలకొల్పే పనిలో పడ్డాయి.

                                           

About Author