NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిమ్మ‌తో కాలేయ ఆరోగ్యం ఘ‌నం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నిమ్మకాయ ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంది. వీటిలో గింజలు తప్ప మిగతాది అమృతవల్లి అని నిపుణులు చెబుతారు. నిమ్మకాయ పచ్చడిని, నిమ్మ పులుసుతో చారు వంటి వాటిని చేసుకుని తినడం వల్ల మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుందని వారు చెబుతున్నారు. దీనిని సంస్కృతంలో నింబా అని హిందీలో నీంబూ అని పిలుస్తారు. నిమ్మ పుండు పుల్లగా ఉంటుందని మనందరికి తెలుసు. వాత రోగాలను పోగొట్టడంలో నిమ్మకాయ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. జీర్ణ శక్తిని మెరుగుపచడంతో పాటు పొట్టలో ఉండే క్రిములను హరిస్తుంది. నీరసాన్ని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో నిమ్మకాయను మించిన ఔషధం లేదు. నిమ్మరసంలో చక్కెరను వేసి తాగితే గంజాయి మత్తు, నల్ల మందు మత్తు, సర్ప విషయం హరించుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో విటమిన్‌-సీ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఫంగల్‌, బాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు కూడా ఉంటాయి.

                                    

About Author