PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అద్దెదారుల‌కు షాక్.. 18 శాతం జీఎస్టీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వస్తు సేవల పన్ను ..జీఎస్టీ కింద ఇకపై అద్దెదారులకు భారీ షాక​ తగలనుంది. దీని ప్రకారం ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే, పన్నుచెల్లింపుదారుల ఐటీ రిటర్న్‌లలో దీనిని మినహాయింపుగా క్లెయిమ్ చేయవచ్చు. అద్దెదారులు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ వార్తపై పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ వివరణ ఇచ్చింది. వ్యాపార సంస్థకు అద్దెకు ఇచ్చినప్పుడు మాత్రమే రెసిడెన్షియల్ యూనిట్ అద్దెకు పన్ను చెల్లించాలి. వ్యక్తిగత ఉపయోగం కోసం ప్రైవేట్ వ్యక్తికి అద్దెకు ఇచ్చినప్పుడు జీఎస్టీ లేదు. వ్యక్తిగత ఉపయోగం కోసం యజమాని లేదా సంస్థ పార్టనర్‌ నివాసాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ జీఎస్టీ ఉండదు అని స్పష్టం చేసింది.

                                   

About Author