వైఎస్ వివేకా హత్య కేసు వేరే రాష్ట్రానికి తరలించండి !
1 min read
పల్లెవెలుగువెబ్ : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కూతురు సునీత రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ కేసు విచారణ చేపట్టినా… ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని అని పిటిషన్లో పేర్కొన్నారు.ఇకపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిగేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఏపీలో న్యాయం జరగకపోవడమే కాకుండా, తీవ్ర జాప్యం అయ్యే అవకాశాలున్నాయి. వేరే రాష్ట్రానికి వివేకా కేసు విచారణను తరలించాలని కూడా పిటీషన్ లో సునీతా విజ్ణప్తి చేశారు.సునీతారెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సిబిఐని ప్రతివాదులుగా చేర్చారు. దీంతో సునీత పిటీషన్ త్వరలో విచారణకు రానుంది.