కాఫీ ఎవరు తాగొచ్చు.. ఎవరు తాగకూడదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రతి రోజు కాఫీ తాగే వారిలో అల్జీమర్స్, టైప్–2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది. అయితే కొందరు మాత్రం అస్సలు కాఫీ తాగకూడదు. వారు ఎవరు? కాఫీ ఎందుకు తాగకూడదో తెలుసుకుందాం. గర్భవతులు లేదా తల్లిపాలు ఇస్తున్న వారు కాఫీకి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఒకవేళ తాగినా, 200 మిల్లీ లీటర్ల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. అలాగే పాలిచ్చే తల్లులు కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల వీరు పాలిచ్చే రోజుల్లో కాఫీ మానటం ఉత్తమం. మెటబాలిజమ్ స్లోగా ఉన్నవారు కాఫీకి దూరంగా ఉండాలి. కొంతమంది వ్యక్తులలో కాఫీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంది. అందువల్ల, తరచు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నవారు కాఫీ తాగడం మానేయాలి లేదా తగ్గించాలి.