రూ. 5వేలతో మొదలై రూ. 45 వేల కోట్లకు ఎదిగిన రాకేష్ ఝున్ ఝున్ వాలా !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ ఇన్వెస్టర్, బిగ్ బుల్ రాకేష్ ఝున్ ఝున్ వాలా కన్నుమశారు. ఆయన మరణం ఇన్వెస్టర్ల కమ్యునిటీకి షాక్ లా తగిలింది. చిన్న వయసులోనే రాకేష్ స్టాక్ మార్కెట్ ప్రస్థానం మొదలైంది. ముంబయిలో 1960 జులై 5న పుట్టిన రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా అక్కడే పెరిగారు. ఆయన తండ్రి ఆదాయ పన్ను శాఖ అధికారి. యువకుడుగా ఉన్నప్పుడే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులపై ఆయనకు ఆసక్తి మొదలైంది. దాంతో, రోజంతా వచ్చే వార్తల వల్ల షేర్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందో గమనించాలని తండ్రి ఆయనకు సలహా ఇచ్చారని చెబుతారు. షేర్ మార్కెట్ మీద ఝన్‌ఝున్‌వాలా ఆసక్తి అంతకంతకూ పెరిగింది. 1985లో ఆయన సిడెన్‌హామ్ కాలేజీలో చదువుతున్న సమయంలోనే షేర్ మార్కెట్‌లో డబ్బులు పెట్టడం ప్రారంభించారు. చార్టెడ్ అకౌంటన్సీ పూర్తి చేసిన తర్వాత తనకు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఉందని ఆయన తన తండ్రికి చెప్పారు. అయితే, “నన్ను, నా స్నేహితులను డబ్బు అడగద్దు” అని ఆయన కొడుకుతో కచ్చితంగా చెప్పేశారు. నువ్వు షేర్ మార్కెట్లో సక్సెస్ కాకపోతే చార్టెడ్ అకౌంటెంట్‌గా నీ కెరియర్ కొనసాగించాలంటూ మాట కూడా తీసుకున్నారు.
5 వేలతో మొదలు !
రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా కేవలం రూ.5 వేలతో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభినట్లు చెబుతారు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఈ ఏడాది ఆయన మొత్తం సంపద విలువ సుమారు రూ.45,328 కోట్లు. ఫోర్బ్స్ వివరాల ప్రకారం ఆయన అత్యంత విలువైన లిస్టెడ్ హోల్డింగ్స్‌లో గడియారాలు, ఆభరణాలు తయారు చేసే టైటన్ ఉంది. ఇది టాటా గ్రూప్‌లో భాగం. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, మెట్రో బ్రాండ్స్, కాన్‌కార్డ్ బయోటెక్ లాంటి ప్రైవేటు కంపెనీల్లో కూడా ఝున్‌ఝున్‌వాలాకు భారీగా వాటాలు ఉన్నాయి. 1986లో ఝున్‌ఝున్‌వాలా ఒక కంపెనీకి సంబంధించిన 5 వేల షేర్లు కొనుగోలు చేశారు. ఆయన వాటిని ఒక్కో షేర్ రూ.43 చొప్పున కొన్నారు. కానీ మూడు నెలల్లోనే ఆ షేర్ ధర ఒక్కక్కటి రూ.143 రూపాయలకు పెరిగింది. షేర్ మార్కెట్‌లో ఆయన విజయాలలో అది మొదటిది.