ఆ అలవాట్లే రాకేష్ ఝున్ ఝున్ వాలా మృతికి కారణమా ?
1 min read
పల్లెవెలుగువెబ్ : రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మృతికి ప్రధాన కారణం ఆయనకున్న అలవాట్లేనని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆయనే చెప్పారు. తనకు మంచి అలవాట్లు లేవని.. అన్నీ దురలవాట్లే ఉన్నాయని పేర్కొన్నారు. పొగగొట్టంలా సిగరెట్లు కాల్చుతానని.. చేపలు నీళ్తు తాగినట్లుగా తాను మద్యం తాగుతానని.. ఒక పందిలా ఆహారం తింటానని… ఆయనే చెప్పారు. కనీస వ్యాయామం కూడా చేయనని గత ఇంటర్వ్యూల్లో రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. అందుకే తన ఆరోగ్యం కొంత ఆందోళన ఉందని అన్నారు. తన వ్యాపరంపైనే ఎక్కువగా దృష్టిపెట్టిన ఆయన.. ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని తెలుస్తోంది. ధూమపానం, మద్యపానం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఈ క్రమంలోనే గుండెపోటుతో ఇవాళ ఉదయం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మరణించారు.