PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త‌మ్మినేని కృష్ణ‌య్య దారుణ హ‌త్య !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం తెల్దారుప‌ల్లి గ్రామ స‌మీపంలో టీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడు త‌మ్మినేని కృష్ణ‌య్య దారుణ హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. తమ్మినేని కృష్ణయ్య హత్యతో తెల్దారుపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తన భర్త హత్య వెనక సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ నాయకులు తమ్మినేని కోటేశ్వరరావు హస్తం ఉందని తమ్మినేని కృష్ణయ్య భార్య ఎంపీటీసీ మంగతాయారు,కూతురు రజిత ఆరోపించారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి.. కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

                                               

About Author