ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సతీవియోగం
1 min readపల్లెవెలుగు వెబ్: ఆంధ్రజ్యోతి సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి వేమూరి కనకదుర్గ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో ఉన్న ఆమె చికిత్సపొందుతూ కన్నుమూశారు. వేమూరి కనకదుర్గ ఆంధ్రజ్యోతి సంస్థ డైరక్టర్ గా ఉన్నారు. వేమూరి కనకదుర్గ మరణంతో ఆంధ్రజ్యోతి సంస్థల ఉద్యోగులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఆమె మృతికి పలువురు సినీ, రాజకీయప్రముఖులు సంతాపం ప్రకటించారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో వేమూరి కనకదుర్గ అంత్యక్రియలు జరగనున్నాయి.