ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశం కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
1 min readపల్లెవెలుగువెబ్ : విద్యా హక్కు చట్టం అమలులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఒకటో తరగతిలో అడ్మిషన్ల కోసం నేటి నుంచి ఈ నెల 26 తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈనెల 30న లాటరీ పద్ధతిలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. వచ్చే నెల 2న ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. అదే రోజు నుంచి మిగిలిపోయిన సీట్లకు రెండో విడత దరఖాస్తుల స్వీకరణను ప్రారంభిస్తారు.