ఆ వయసులో క్యాన్సర్ ముప్పు ఎక్కువట !
1 min readపల్లెవెలుగువెబ్ : ‘నేషనల్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్’ సర్వే ప్రకారం కొత్త క్యాన్సర్‌లలో 60 శాతం 65 సంవత్సరాల పైబడినవారిలోనే కనిపిస్తున్నాయి. వారిలో 70 శాతం మృత్యువాత పడుతున్నారు. వీరు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం పది రెట్లు అధికం. ముఖ్యంగా కొలాన్, రెక్టల్, ప్రొస్టేట్, ప్యాంక్రియాజ్, ఊపిరితిత్తులు, మూత్రాశయం, పొట్ట, రొమ్ము క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువ. క్యాన్సర్ కణితులు చికిత్సకు లొంగడం కష్టం. వయసు పైబడిన వారిలో క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. చిన్నతనంలో దీర్ఘకాలికంగా ధూమపానం, మద్యపానం, ఎక్కువ మందితో శారీరక సంబంధాలు పెట్టుకోవడం వంటి దురలవాట్లు ఇందుకు కారణం అవుతున్నాయి.