నా పెళ్లి సమయానికి మా ఆవిడకు ఒక కొడుకు ఉన్నాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : సినీ కెరీర్‌తో ఫుల్ బిజీగా ఉన్న బ్రహ్మాజీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అందరిలా సినిమా కష్టాలు పడలేదని, అలాగే తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ”తూర్పు గోదావరి జిల్లాలో పుట్టిన నేను పశ్చిమ గోదావరి జిల్లాలో పెరిగా. మా తండ్రిగారు తహసీల్దార్. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు గారు సైతం ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఇదిలా ఉంటే ఆయన నటించిన ‘శంకరాభరణం’ రిలీజై మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌తో సోమయాజులు గారికి విపరీతమైన క్రేజ్ పెరిగింది. దీంతో ఆయనకు భారీగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అది చూసిన నేను.. సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా? అని అనిపించింది. ఎలాగైన పరిశ్రమలోకి వెళ్లాలని అనుకుని, చదువు పూర్తయిన వెంటనే చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాను.“ అని చెప్పాడు. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చాడు. ”నేను ఒక బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆమెతో పరిచయం ఏర్పడింది. అయితే నేను మ్యారేజ్ చేసుకునే సమయానికే ఆమెకు విడాకులు కాగా, ఒక అబ్బాయి కుడా ఉన్నాడు. ఆమెను ఇష్టపడి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నాను. ఇది వరకే బాబు ఉండగా మాకు మళ్లీ పిల్లలు ఎందుకు? అని వద్దనుకున్నాం. ఆ అబ్బాయే ఇప్పడు ‘పిట్టకథ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్డాడు” అని అన్నారు.