దీనస్థితిలో సచిన్ సహచరుడు !
1 min readపల్లెవెలుగువెబ్: ప్రపంచ క్రికెట్లో 90వ దశకంలో ఓ వెలుగు వెలిగిన వినోద్ కాంబ్లీ రకరకాల కారణాల చేత ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం పూట గడవని దీనావస్థలో ఉన్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాతో పంచుకున్నాడు. క్రికెట్‌కు సంబంధించి ఏదైనా పని ఉంటే ఇప్పించాలని బీసీసీఐని వేడుకుంటున్నాడు. బీసీసీఐ ఇస్తున్న ముప్సై వేల పెన్షనే తనను తన కుటుంబాన్ని బతికిస్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొద్దిరోజుల క్రితం వరకు నేరుల్లో ‘టెండుల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ’లో యువ క్రికెటర్లకు మెంటార్‌గా పని చేసేవాడినని.. అయితే, నేరుల్ తను నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉండటంతో సగం రోజు ప్రయాణానానికే సరిపోతుందని.. అందుకే తప్పని పరిస్థితుల్లో ఆ ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) చొరవ తీసుకుని వాంఖడే లేదా బీకేసీ స్టేడియంలో ఏదైనా క్రికెట్‌కు సంబంధించిన పని ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని అభ్యర్ధించాడు. పెన్షన్ ఇచ్చి తనను, తన కుటుంబాన్ని పోషిస్తున్న బీసీసీఐకి జీవితకాలం రుణపడి ఉంటానని అన్నాడు.